ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ.. పెట్టుబడి ఎలా పెట్టాలంటే..?

Investing in Government Bonds Yields Higher Interest Than Fixed Deposits
x

ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ.. పెట్టుబడి ఎలా పెట్టాలంటే..?

Highlights

Government Bonds: సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు.

Government Bonds: సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు. ఎందుకంటే అధిక వడ్డీ ఆశిస్తారు.. చాలామంది ఇందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లే బెటర్ అని నమ్ముతారు. ఇది నిజమే కావొచ్చు. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ, మీ డబ్బుకి భద్రత ప్రభుత్వ బాండ్లలో లభిస్తుంది. ఇందులో మంచి రాబడిని పొందవచ్చు. అందుకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ను ప్రారంభించింది. ఇందులో దేశంలోని సామాన్యులు సులభంగా పెట్టుబడులు పెట్టగలరు. ఈ పథకం కింద దేశంలోని అతి చిన్న పెట్టుబడిదారుడు కూడా ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును పొందుతారు. అంతేకాదు మీ డబ్బు ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఇందుకోసం ప్రజలు 4 ఎంపికలను పొందుతారు. అందులో ఒకటి ట్రెజరీ బిల్లులు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ బాండ్లు, 91 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు జారీ చేస్తారు. రెండోది డేటెడ్ గవర్నమెంట్ బాండ్లు ఇవి కేంద్ర ప్రభుత్వ బాండ్లు, ఒకటి కంటే ఎక్కువ కాలానికి జారీ చేస్తారు. మూడు రాష్ట్ర అభివృద్ధి రుణాలు అంటే రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు అని అర్థం. నాలుగు సావరిన్ గోల్డ్ బాండ్లు

ఏదైనా ప్రభుత్వం లేదా కంపెనీ డబ్బును సేకరించేందుకు బాండ్లను జారీ చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆ మొత్తానికి స్థిర వడ్డీని ఇస్తుంది. మీ డబ్బు భద్రతకు పూర్తి హామీని ఇస్తుంది. సాధారణ ప్రజల కోసం ప్రారంభించిన పథకాలకు బాండ్లకు బదులుగా ప్రభుత్వం పెట్టుబడిదారుల నుంచి పొందిన డబ్బును ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి మీరు రిజర్వ్ బ్యాంక్ పోర్టల్ ని సందర్శించడం ద్వారా RDG ఖాతాను ఓపెన్ చేసి బాండ్లను కొనుగోలు చేయాలి. దీంతో పాటు లాభం చూసి వాటిని ఈ పోర్టల్లో విక్రయాలు కూడా జరుపవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories