Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన దూకుడు

Stock Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * భారత ఈక్విటీ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభం

Sandeep Eggoju
Published on: 18 March 2021 10:10 AM IST
Indian Stock Markets in the Path of Proft
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభం కాగా సెన్సెక్స్‌ 50,239 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14,855 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్ 430 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 14,900 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి.అమెరికా ఆర్దిక పునరుత్తేజం లక్ష్యంగా కేంద్ర బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా వుంచిన నేపధ్యంలో గ్లోబల్ మార్కెట్లు సానుకూల ధోరణిలో కదలాడుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story