Stock markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Stock markets: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం.. * ఆరంభంలోనే సెన్సెక్స్ 550 పాయింట్ల లాభం

Sandeep Eggoju
Published on: 25 Feb 2021 10:28 AM IST
Indian Stock Markets Are in The Path of Profit
X

Representational Image

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ ఆరంభంలోనే 550 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. నిఫ్టీ 15వేల 150 పాయింట్ల మార్క్ ను తాకింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ సెన్సెక్స్ 534 పాయింట్లు జంప్ చేసి.. 51వేల 316 వద్దకు చేరగా.. నిఫ్టీ 166 పాయింట్లు ఎగబాకి 15వేల 148 వద్ద కదలాడుతున్నాయి.

క్రితం సెషన్ లో నిఫ్టీ లో ఏర్పడ్డ సాంకేతిక లోపం దరిమిలా ట్రేడింగ్ సమయాన్ని పొడిగించగా.. కీలక సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. తాజా సెషన్ లోనూ అదే దూకుడుతో దేశీ మార్కెట్లు కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story