Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో ప్రయాణించండి..

Independence Day Special Offer Airasia Rs.1475 to fly by Plane
x

Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో ప్రయాణించండి..

Highlights

Airasia: Airasia భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ. దీని ద్వారా ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Airasia: Airasia భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ. దీని ద్వారా ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. భారతదేశం ఈ సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా AirAsia తన కస్టమర్ల కోసం గొప్ప స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ని ప్రకటించింది. ప్రయాణికులకి కేవలం రూ.1475కే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించింది.

మీరు కూడా ఈ ఆఫర్ పొందాలనుకుంటే 13 ఆగస్టు 2022 వరకు ఎయిర్ ఏషియా దేశీయ విమానాలను బుక్ చేసుకోండి. అంతర్జాతీయ విమానాలకు ఈ ఆఫర్ వర్తించదని గమనించండి. దీంతో పాటు మీ ప్రయాణం 25 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ఉండాలి. మీరు కూడా ఈ గొప్ప ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వెంటనే త్వరపడండి.

మీరు స్వాతంత్ర్య దినోత్సవం 2022 సందర్భంగా AirAsia అందిస్తున్న ఈ ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అమలవుతుంది. దీంతో పాటు ఈ ఆఫర్ పరిమిత మార్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పరిస్థితిలో పరిమిత సీట్లను నింపడానికి ముందు మీ టికెట్‌ని బుక్ చేసుకోండి.


Show Full Article
Print Article
Next Story
More Stories