Alert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. 4 లక్షల ఆర్థిక భరోసా కోల్పోకండి..!

In Your Bank Account Rs.456 are or PMJJBY PMSBY not Eligible
x

Alert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్‌.. 4 లక్షల ఆర్థిక భరోసా కోల్పోకండి..!

Highlights

Alert: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) వార్షిక బీమా ప్రీమియం రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది.

Alert: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) వార్షిక బీమా ప్రీమియం రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ రెండు పథకాలు నేరుగా సామాన్య ప్రజల సంక్షేమానికి సంబంధించినవి. ఇవి బ్యాంకుల ద్వారా నిర్వహిస్తారు. ఈ పరిస్థితిలో పెరిగిన ప్రీమియం రేట్ల గురించి సమాచారాన్ని అందరు తెలుసుకోవాలి. కనీస బ్యాలెన్స్‌తో సహా అకౌంట్‌లో రూ. 456 విడిగా ఉంచుకోవాలి. ఈ విషయం బ్యాంకు వినియోగదారులందరికి సూచిస్తోంది.

PMJJBY ప్రీమియం ఎంత పెరిగింది?

ఈ రెండు పథకాల ప్రీమియాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)వార్షిక ప్రీమియం రూ. 330 నుంచి రూ. 436కి పెరిగింది. ప్రభుత్వం ప్రీమియం మొత్తాన్ని రోజుకు రూ.1.25 పెంచింది. ఏ కారణం చేతనైనా మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

PMSBY ప్రీమియం ఎంత పెరిగింది?

ఇది కాకుండా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ప్రీమియాన్ని రూ.12 నుంచి రూ.20కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఈ ప్రీమియం సంవత్సరానికి రూ. 12 మాత్రమే. ఇప్పుడు రూ.8 పెంచారు. ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యం జరిగినా 2 లక్షల రూపాయలు ఇచ్చే నిబంధన ఉంది. పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.లక్ష ఇస్తారు. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Show Full Article
Print Article
Next Story
More Stories