EPFO New Rules: ఈపీఎఫ్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త నిబంధనలు.. వాటిని తప్పనిసరి చేస్తూ సర్య్కూలర్ జారీ..!!

EPFO New Rules: ఈపీఎఫ్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త నిబంధనలు.. వాటిని తప్పనిసరి చేస్తూ సర్య్కూలర్ జారీ..!!
x
Highlights

EPFO New Rules: ఈపీఎఫ్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త నిబంధనలు.. వాటిని తప్పనిసరి చేస్తూ సర్య్కూలర్ జారీ..!!

EPFO New Rules: ఒకప్పుడు ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు సవరించుకోవడం అంటే చాలా మందికి తలనొప్పిగానే ఉండేది. చిన్న తప్పు అయినా సరే, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించేలా ఈపీఎఫ్‌వో (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ రికార్డుల్లో పేరు, లింగం వంటి వివరాలను మార్చుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తాజా సర్క్యూలర్‌ను విడుదల చేసింది.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈపీఎఫ్ ఖాతాలో పేరు లేదా లింగ వివరాలు తప్పుగా నమోదై ఉంటే, వాటిని సవరించుకోవడం ఇప్పుడు చాలా ఈజీగా మారింది. ఇందుకోసం ఏయే పత్రాలను సమర్పించవచ్చో స్పష్టంగా పేర్కొంటూ మొత్తం 18 రకాల డాక్యుమెంట్ల జాబితాను ఈపీఎఫ్‌వో విడుదల చేసింది. ఉద్యోగులు తమ వద్ద అందుబాటులో ఉన్న పత్రాలలో ఏదైనా ఒకదాన్ని ఆధారంగా చూపించి సవరణ చేయించుకోవచ్చు.

పేరు, లింగ వివరాల మార్పు కోసం పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫొటో ఐడీ కార్డులు, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలు ఇచ్చే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లను వినియోగించుకోవచ్చు. అలాగే యూనివర్సిటీ లేదా బోర్డు జారీ చేసే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్, మార్క్ షీట్లను కూడా ఈపీఎఫ్‌వో ఆమోదించింది.

ఇవే కాకుండా బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు, ఈ-పాన్, రేషన్ కార్డు, పీడీఎస్ ఫొటో కార్డు, ఓటర్ ఐడీ, ఈ-ఓటర్ ఐడీ, పెన్షనర్ ఫొటో కార్డులను కూడా చెల్లుబాటు అయ్యే పత్రాలుగా గుర్తించింది. ఆరోగ్య పథకాల కింద వచ్చే సీజీహెచ్‌ఎస్, ఈసీహెచ్‌ఎస్ మెడిక్లెయిమ్ కార్డులు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు జారీ చేసే ఆర్‌ఎస్‌బీవై కార్డులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్లను కూడా ఉపయోగించుకోవచ్చు.

పూర్తి పేరు లేదా మొదటి పేరు మార్పు విషయంలో ప్రత్యేక నిబంధనను కూడా ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. కొత్త పేరును అధికారికంగా ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరును నిర్ధారించే సహాయక పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. అదేవిధంగా పాస్‌పోర్ట్, వీసా, స్వాతంత్ర్య సమరయోధుల కార్డు వంటి పత్రాలకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించారు. ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ సర్టిఫికేట్‌ను కూడా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్‌గా గుర్తిస్తూ ఈపీఎఫ్‌వో మరో కీలక ముందడుగు వేసింది.

ఈ కొత్త నిబంధనలను దేశవ్యాప్తంగా అన్ని ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇకపై ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాల్లో వ్యక్తిగత వివరాలను సులభంగా, వేగంగా సరిచేసుకునే అవకాశం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories