ఈ ప్రభుత్వ పథకంలో రోజు రూ.200 పొదుపు చేస్తే 32 లక్షలు మీ సొంతం..!

If you Save Rs.200 a day in the Public Provident Fund Scheme you Will Own 32 Lakhs
x

ఈ ప్రభుత్వ పథకంలో రోజు రూ.200 పొదుపు చేస్తే 32 లక్షలు మీ సొంతం..!

Highlights

Public Provident Fund: తరచుగా మనం రూ. 100, 200 లేదా 500 రూపాయలని పొదుపు చేయడానికి పెద్దగా ఇష్టపడం.

Public Provident Fund: తరచుగా మనం రూ. 100, 200 లేదా 500 రూపాయలని పొదుపు చేయడానికి పెద్దగా ఇష్టపడం. కానీ మనం చిన్న పొదుపులను ఒక అలవాటుగా చేసుకుంటే రాబోయే సంవత్సరాల్లో అది భారీ మొత్తం అవుతుంది. మీరు ప్రతిరోజూ రూ. 200 ఆదా చేసి ప్రతి నెలా ప్రభుత్వ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకంలో పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో మీకు 32 లక్షల రూపాయల ఫండ్‌ క్రియేట్‌ అవుతుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పొదుపు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. కేవలం రూ.500తో ఈ ఖాతా తెరవొచ్చు. ఇందులో ఏటా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు. కానీ మెచ్యూరిటీ తర్వాత 5 నుంచి మరో 5 ఏళ్ల వరకు పొడగించుకోవచ్చు.

మీరు ప్రతిరోజూ 200 రూపాయలు ఆదా చేస్తే ప్రతి నెలా 6000 రూపాయలు ఆదా అవుతాయి. ఇలా 20 సంవత్సరాల పాటు మెయింటెయిన్ చేస్తే మెచ్యూరిటీపై రూ. 3,195,984 పొందుతారు. మీ వయస్సు 25, నెలవారీ ఆదాయం 30-35 వేలు ఉంటే ప్రారంభ రోజుల్లో మీకు పెద్దగా బాధ్యత ఉండదు. కాబట్టి రోజుకు రూ. 200 ఆదా చేయడం సులభం. ఈ విధంగా 45 సంవత్సరాల వయస్సులో మీరు పీపీఎఫ్‌ నుంచి సుమారు రూ.32 లక్షల నిధిని పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories