రిటైర్మెంట్‌ తర్వాత 60,000 వేల పెన్షన్‌.. రోజుకు రూ.7 పొదుపు చేస్తే చాలు.. ఎలాగంటే..?

If you Save Rs 7 per day as Atal Pension Scheme you can get a Pension of Rs 60,000 per year
x

రిటైర్మెంట్‌ తర్వాత 60,000 వేల పెన్షన్‌.. రోజుకు రూ.7 పొదుపు చేస్తే చాలు.. ఎలాగంటే..?

Highlights

Atal Pension: తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ఎన్నో స్కీములను ప్రవేశపెడుతోంది.

Atal Pension: తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ఎన్నో స్కీములను ప్రవేశపెడుతోంది. రిటైర్మెంట్‌ తర్వాత వారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవద్దని ప్రధాని నరేంద్రమోడీ అటల్‌ పెన్షన్‌ యోజన స్కీమ్‌ని ప్రవేశపెట్టారు. ఇందులో తక్కువ పొదుపుతో రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్ పొందేలా ప్లాన్‌ చేశారు. ఇప్పటికే ఇందులో చాలామంది చేరారు. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌ ప్రకారం.. రోజుకు ఏడు రూపాయలు పొదుపు చేస్తే సంవత్సరానికి అరవై వేల పెన్షన్ పొందవచ్చు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.

అటల్ పెన్షన్ యోజన ప్రవేశానికి కనీస వయస్సు

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి ప్రారంభించడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. పెట్టుబడిదారులు కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5000 వరకు నెలవారీ పెన్షన్‌ను ఎంచుకోవచ్చు.18 సంవత్సరాల వయస్సు గల పెట్టుబడిదారులు రిటైర్మెంట్‌ చేసినప్పటి నుంచి నెలవారీ రూ.5000 పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 పెట్టుబడి పెట్టాలి. నెలకు రూ.210 పెట్టుబడి అంటే రోజుకు రూ.7కి రూపాయలు. ఏడాదిలో పెట్టుబడిదారుడికి రూ.60,000 పెన్షన్ అందుతుంది. అయితే వ్యక్తికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ. 5000 నెలవారీ పెన్షన్‌ను పొందుతాడు. పెట్టుబడిదారుడు నెలకు రూ. 210 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

అటల్‌ పెన్షన్‌లో నమోదు ఎలా..?

ముందుగా అటల్ పెన్షన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వ్యక్తిగత, ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేయాలి. OTP ద్వారా సమాచారాన్ని ధృవీకరించాలి. ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

ఈ OTP నమోదు చేసి బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ ఎంటర్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతా యాక్టివేట్ అవుతుంది.

నామినీ వివరాలను నమోదు చేసి ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలి. ఫారమ్‌పై ఈ-సైన్ చేస్తే మీ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే. మరిన్ని వివరాలకు అటల్‌ పెన్షన్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories