Credit Card: క్రెడిట్‌ కార్డు యూజర్లకి అలర్ట్‌.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం..!

If you are Using a Credit Card be Sure to know These Rules
x

Credit Card: క్రెడిట్‌ కార్డు యూజర్లకి అలర్ట్‌.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం..!

Highlights

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్రెడిట్ కార్డ్‌ల ట్రెండ్ బాగా పెరిగింది.

Credit Card: ఆన్‌లైన్ షాపింగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్రెడిట్ కార్డ్‌ల ట్రెండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం బ్యాంకులు ఉచితంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు వీటి గురించి సరైన సమాచారం తెలుసుకోకుండానే వాడుతున్నారు. ఆ తర్వాత బ్యాంకులు క్రెడిట్ కార్డుపై అనేక ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెడుతున్నాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడే ముందు బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధిస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు బ్యాంకు ప్రతి నెలా బిల్లులు పంపుతుంది. వీటిని చెల్లించడానికి బ్యాంకు 10 నుంచి 15 రోజుల సమయం ఇస్తుంది. కానీ మీరు చివరి తేదీ తర్వాత చెల్లింపు చేస్తే ఆలస్య రుసుమును వసూలు చేస్తుంది. దాదాపు అన్ని బ్యాంకుల ఆలస్య రుసుము రూ. 500 వరకు ఉంటుంది. ఈ రుసుమును నివారించడానికి మీరు సకాలంలో బిల్లులలు చెల్లించాలి. మీరు ఆటో మోడ్‌లో కూడా క్రెడిట్ కార్డ్ చెల్లింపు చేయవచ్చు. అంటే మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్‌గా క్రెడిట్‌ కార్డు బిల్లు కట్‌ అవుతుంది. తర్వాత మీ బిల్లు జనరేట్ అవుతుంది. దీని కోసం మీరు క్రెడిట్ కార్డ్‌ని మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్ చేసుకోవాలి.

మీరు బ్యాంక్ ఛార్జీలను నివారించాలనుకుంటే పూర్తి క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించాలి. మీరు కనీస మొత్తాన్ని చెల్లిస్తే మిగిలిన మొత్తంపై బ్యాంక్ భారీ ఛార్జీలను వసూలు చేస్తుంది. కనిష్టంగా చెల్లించడం ద్వారా మీరు ఆలస్య రుసుము నుంచి బయటపడుతారు కానీ బకాయి ఉన్న మొత్తంపై బ్యాంకు వడ్డీ ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జీలను నివారించడానికి ఎల్లప్పుడూ పూర్తి చెల్లింపు చేయడం అలవాటు చేసుకోవాలి. మీరు క్రెడిట్ కార్డ్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేసినా బ్యాంక్ ఛార్జీ విధిస్తుంది. ఈ ఛార్జీలు అన్ని బ్యాంకుల్లో విభిన్నంగా ఉంటాయి. కార్డ్‌ని ఉపయోగించే ముందు కార్డ్‌లో పరిమితి ఎంత ఉందో తెలుసుకోవడం ముఖ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories