Ration Card: రేషన్ కార్డ్ లేదంటే ఈ ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సిందే..!

If There is no Ration Card the Benefits of This Government Will be Lost
x

Ration Card: రేషన్ కార్డ్ లేదంటే ఈ ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సిందే..!

Highlights

Ration Card: పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.

Ration Card: పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వీటిద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం రేషన్ కార్డులను జారీ చేస్తుంది. వీటిద్వారా తక్కువ ధరకు ఒక్కోసారి ఉచితంగా రేషన్ అందిస్తుంది. అయితే చాలామందికి రేషన్‌కార్డు ప్రయోజనాలు తెలియక అప్లై చేసుకోవడం లేదు. ఈ పరిస్థితిలో వారు ప్రభుత్వ ప్రయోజనాలని కోల్పోతున్నారు.

అర్హులు తప్పనిసరిగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. రేషన్ కార్డును ప్రతి రాష్ట్రం దాని నివాసితుల కోసం జారీ చేస్తుంది. వీటిపై వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేషన్‌ కార్డు ఉంటుంది. రేషన్‌ కార్డుని గుర్తింపు చిరునామాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

రేషన్ కార్డు ప్రయోజనాలు

1. రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.

2. రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారుడికి తక్కువ ధరకే ఆహార ధాన్యాలు అందుతాయి.

3. రేషన్ కార్డు ద్వారా ప్రజలు కిరోసిన్ తదితరాలను పొందడం సులభం.

4. అనేక రాష్ట్రాలు రేషన్ కార్డు హోల్డర్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

5. బ్యాంకు ఖాతా తెరవడానికి రేషన్ కార్డును ఉపయోగించవచ్చు.

6. కొత్త ఓటర్ ఐడీని తయారు చేసేందుకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది.

7. కొత్త మొబైల్ సిమ్ కొనడానికి రేషన్ కార్డు ఉపయోగపడుతుంది.

8. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి రేషన్ కార్డు ఉపయోగపడుతుంది.

9. కొత్త LPG కనెక్షన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories