Indian Railway: రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోయిందా.. వెంటనే ఇలా చేయండి..!

If the Ticket is Lost While Traveling on the Train get a Duplicate Ticket Immediately
x

Indian Railway: రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోయిందా.. వెంటనే ఇలా చేయండి..!

Highlights

Indian Railway: భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ఆసియాలో రెండో అతిపెద్ద రైలు నెట్‌వర్క్.

Indian Railway: భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ఆసియాలో రెండో అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ప్రతిరోజు లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణంలో ఎక్కడైనా మీ టికెట్ పోతే ఏం చేస్తారు. దీనికి సంబంధించిన రైల్వే కొన్ని నియమాలని సూచించింది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం. రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్ పోయినట్లయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. వెంటనే టీసీ ద్వారా డూప్లికేట్‌ టికెట్‌ని పొందవచ్చు. దీని కోసం మీరు కొంత జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

అయితే టికెట్‌ కనిపించకుండాపోయిన వెంటనే మీరు టీసీని సంప్రదించాలి. అతడికి డూప్లికేట్ టికెట్‌ జారీచేసే అధికారం ఉంటుంది. భారతీయ రైల్వే వెబ్‌సైట్ indianrail.gov.in ప్రకారం.. మీరు రూ. 50 చెల్లించి స్లీపర్ తరగతికి నకిలీ టిక్కెట్‌ను పొందవచ్చు. అలాగే రెండో తరగతి వారికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కోల్పోయిన అసలు టికెట్‌ దొరికితే రైలు దిగాక రెండు టిక్కెట్లను అధికారులకు చూపించవచ్చు. అలా చేస్తే డూప్లికేట్ టిక్కెట్‌కి చెల్లించిన రుసుము వాపసు చెల్లిస్తారు. అయితే టికెట్‌ మొత్తంలో 5% తీసివేస్తారు. అంటే కనిష్టంగా రూ. 20 అవుతుంది.

అలాగే టికెట్‌ రిజర్వేషన్‌ సమయంలో తరచుగా ప్రయాణికులు మిడిల్ బెర్త్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపరు. ఎందుకంటే చాలా సార్లు దిగువ బెర్త్‌లోని ప్రయాణీకులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. దీనివల్ల మిడిల్ బెర్త్‌తో ప్రయాణీకులకు సమస్యలు ఎదురవుతాయి. ఇది కాకుండా చాలాసార్లు మిడిల్ బెర్త్ ప్రయాణికులు బెర్త్‌ను ఓపెన్‌ చేయడం వల్ల దిగువ బెర్త్‌పై కూర్చున్న ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితిలో మీరు బెర్త్‌కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణీకుడు తన బెర్త్‌ను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచి ఉంచి పడుకోవచ్చు. ఒకవేళ 10 గంటలలోపు ఓపెన్‌ చేస్తే లోయర్ బెర్త్ ప్యాసింజర్ అభ్యంతరం చెప్పవచ్చు. రైల్వే నిబంధనల గురించి తెలియజేసి సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories