Home Loan Rules: హోమ్‌లోన్‌ అమౌంట్‌ సరిపోకుంటే ఈ సదుపాయం కూడా పొందవచ్చు.. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు..!

Home Loan Rules: ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దీనిని నెరవేర్చుకుంటారు. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు హోమ్‌లోన్‌ ఆఫర్‌ ఇస్తున్నాయి.

Shekhar G
Updated on: 13 Jan 2024 9:00 AM IST
If The Home Loan Amount Is Not Enough You Can Take A Top-Up Loan No Guarantee Is Required
X

Home Loan Rules: హోమ్‌లోన్‌ అమౌంట్‌ సరిపోకుంటే ఈ సదుపాయం కూడా పొందవచ్చు.. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు..!

Home Loan Rules: ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దీనిని నెరవేర్చుకుంటారు. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు హోమ్‌లోన్‌ ఆఫర్‌ ఇస్తున్నాయి. దీనిద్వారా చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే కొన్ని రూల్స్‌ మాత్రం పాటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు హోమ్‌లోన్‌ తీసుకున్నా ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సరిపోకపోవచ్చు. ఇలాంటి సమయంలో పని ఆపాల్సిన అవసరం లేదు. బ్యాంకులు మరొక సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే హోమ్‌లోన్‌ తీసుకొని ఆ డబ్బులు సరిపోకపోతే మీ హోమ్ లోన్‌పై టాప్-అప్ లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ ఇంటిని నిర్మించడానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే అవి సరిపోకపోతే దానిపై అదనపు డబ్బు తీసుకోవచ్చు. దీనిని టాప్ అప్ లోన్ అంటారు. ఇప్పటికే ఉన్న రుణంపై రోండో రుణం తీసుకోవడం టాప్‌ అప్‌లోన్‌ అవుతుంది. దీనికి ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. సులువుగా పొందవచ్చు.

మీ హోమ్ లోన్ అమలులో ఉన్న బ్యాంక్ కు వెళ్లి హోమ్ లోన్‌పై టాప్-అప్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి. లేదంటే బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో టాప్-అప్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీ హోమ్ లోన్ ఇప్పటికే ఈ బ్యాంక్ నుంచి అమలవుతోంది. ఒకవేళ మీరు టాప్‌ అప్‌లోన్‌ తీసుకుంటే దీని EMI కూడా మీ హోమ్ లోన్‌కి కలిపి వసూలు చేస్తారు. రెండింటికీ కలిపి నెలవారీ వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది.

Shekhar G

Shekhar G

Next Story