Aadhaar Alerts: ఆధార్‌ అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకుంటే చాలా బాధపడుతారు..!

If the Aadhaar Card is Not Updated by this Date the Payment will be Made Later
x

Aadhaar Alerts: ఆధార్‌ అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకుంటే చాలా బాధపడుతారు..!

Highlights

మీరు ఇప్పటి వరకు ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేయకుంటే చాలా బాధపడుతారు. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం చాలా కాలం క్రితం చివరి తేదీని జారీ చేసింది.

Aadhaar Alerts:

మీరు ఇప్పటి వరకు ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేయకుంటే చాలా బాధపడుతారు. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం చాలా కాలం క్రితం చివరి తేదీని జారీ చేసింది. భారతీయులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. ఇది లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఆగిపోతాయి. ఆధార్ కార్డ్‌లో పాత సమాచారం ఉండి అప్‌డేట్ చేయకుంటే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. తాజా సమాచారంతో ఆధార్‌ను అప్‌డేట్ చేయకుంటే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇదే చివరి తేదీ

10 ఏళ్ల నాటి ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. మీ దగ్గర 10 ఏళ్ల ఆధార్ కార్డ్ ఉంటే దానిని త్వరగా అప్‌డేట్ చేయాలి. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 14 గా నిర్ణయించారు. అప్‌డేట్ కోసం మీరు UIDAI వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ ఎటువంటి ఛార్జీ ఉండదు.

మీరు ఇలా అప్‌డేట్ చేసుకోవచ్చు

ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి రెండు పద్ధతులను ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు రెండూ ఉన్నాయి. కొన్ని పనులు ఆన్‌లైన్‌లో చేయవచ్చు కానీ బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, ఆన్‌లైన్‌లో చేయలేని ఇతర ప్రత్యేక పనులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇందుకోసం ఆధార్ కేంద్రం లేదా CSC కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. కావాలంటే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. తద్వారా క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories