ICICI Bank: ఉద్యోగుల కోవిడ్-19 టీకా ఖర్చు మేమే భరిస్తాం: ఐసీఐసీఐ

Venkata Chari
Published on: 10 March 2021 6:38 PM IST
ICICI Bank to bear the cost of COVID 19 vaccination for employees and Family
X

ఐసీఐసీఐ బ్యాంక్ (ఫొటో ట్విట్టర్)

ICICI Bank: తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉచింతంగానే వ్యాక్సినేషన్‌ ఇస్తామని ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ ప్రకటించింది. సుమారు లక్ష మంది వరకు ఉండే ఎంప్లాయిస్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ ఖర్చును మేమే భరించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

కోవిడ్-19 రెండు టీకాల ఖర్చు మొత్తాన్ని ఉద్యోగులకు రీయింబర్స్‌ చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వేళ ఎంతో మంది వినియోగదారులకు తమ ఉద్యోగులు క్లిష్ట సమయంలోనూ సేవలందించారని పేర్కొంది.

అలాంటి ఎంప్లాయిస్‌ను, వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవడం మా బాధ్యతగా భావించమని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్ టీకే శ్రీరంగ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ కంపెనీలు వారి ఉద్యోగులకు వ్యాక్సిన్‌ను ఫ్రీగా అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Venkata Chari

Venkata Chari

Next Story