Business Idea: రోజుకు రూ.10,000 సులభంగా ఆదాయం.. కాసుల వర్షం కురిపిస్తున్న వ్యాపారం

Business Idea
x

Business Idea: రోజుకు రూ.10,000 సులభంగా ఆదాయం.. కాసుల వర్షం కురిపిస్తున్న వ్యాపారం

Highlights

Ice Apple Business Idea: ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అది లాభాల బాటలో వెళ్తుందా అని అంచనా వేసుకుంటాం. అయితే ప్రధానంగా సీజనల్ బిజినెస్ ఎప్పటికైనా లాభదాయకంగానే ఉంటాయి.

Ice Apple Business Idea: ఈ సీజన్‌లో బిజినెస్ ప్రారంభిస్తే కాసుల వర్షం కురిపించే వ్యాపారం ఏముంటుందని అనుకుంటున్నారా?. దీనికి తాటి ముంజల బిజినెస్ ఎంతో బెస్ట్ అని చెప్పొచ్చు. ముంజలకు ఈ సీజన్‌లో డిమాండ్ ఎక్కువ. డిహైడ్రేషన్ కి గురికాకుండా తాటి ముంజలు తీసుకుంటారు. దీంతో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతిరోజు రూ.10,000 వరకు ఆదాయం గడించవచ్చని చెబుతున్నారు.

ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు స్వయంగా తాటి ముంజలను తీసుకువచ్చి. ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలు, మార్కెట్లలో విక్రయిస్తే డజనుకు రూ.100 చొప్పున ప్రతిరోజు రూ.10,000 వరకు ఆదాయం గడించవచ్చు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఈ బిజినెస్‌కు మొగ్గు కూడా చూపిస్తున్నారు. ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు.

తాటి ముంజలు అమ్ముతూ వ్యవసాయం చేసి జీవనోపాధి సొంతంగా పెంచవచ్చు. ప్రధానంగా ఎండాకాలం ఎక్కువగా మార్కెట్లో ఈ తాటి ముంజలు కనిపిస్తాయి. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే డిహైడ్రేషన్ కి గురికాకుండా తాటి ముంజలను కచ్చితంగా కనిపించగానే తీసుకుంటారు. ఇక రూ. 100 డజన్ చొప్పున విక్రయించినా కానీ రూ. 10,000 సులభంగా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories