Post Office Scheme : పోస్టాఫీసు బంపర్ ఆఫర్.. నెలకు రూ.10,000కడితే రూ.7 లక్షలు మీవే

Post Office Scheme
x

Post Office Scheme : పోస్టాఫీసు బంపర్ ఆఫర్.. నెలకు రూ.10,000కడితే రూ.7 లక్షలు మీవే

Highlights

Post Office Scheme : తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని అందించే పెట్టుబడి మార్గం కోసం చూస్తున్నారా? అయితే, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్.

Post Office Scheme : తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని అందించే పెట్టుబడి మార్గం కోసం చూస్తున్నారా? అయితే, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఉండే హెచ్చుతగ్గుల భయం లేకుండా, మీరు పెట్టిన ప్రతీ పైసాకు ప్రభుత్వ హామీ ఉంటుంది. నెలకు కేవలం రూ.10,000 పొదుపు చేస్తే చాలు, ఐదేళ్లలో ఏకంగా రూ.7 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీసులో అందించే అనేక చిన్న పొదుపు పథకాలలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది సాధారణ బ్యాంక్‌లలో ఉండే రికరింగ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పోస్టాఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసు RD పథకం సాధారణంగా 60 నెలల టెన్యూర్ కలిగి ఉంటుంది. అంటే, మీరు ఐదు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత, మొత్తం పెట్టుబడిని వడ్డీతో కలిపి ఒకేసారి తిరిగి పొందవచ్చు. ప్రస్తుతం, ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 6.7%గా ఉంది. అయితే, ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సవరిస్తుంది. కాబట్టి, వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఈ పథకంలో నెలకు కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. అంటే, మీరు ఎంత ఎక్కువ డబ్బునైనా డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి, ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఐదు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.7,13,659 వస్తుంది. మీరు ఈ 60 నెలల కాలంలో RD అకౌంట్‌లో మొత్తం రూ.6,00,000 పెట్టుబడిగా పెడతారు. ఐదు సంవత్సరాలలో మీరు పొందే వడ్డీ రూ.1,13,659 అవుతుంది.

ఒకవేళ మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయాలనుకుంటే, అంటే నెలకు రూ.20,000 చొప్పున డిపాజిట్ చేస్తే, ఐదు సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి విలువ రూ.14,27,315 అవుతుంది. ఇది కేవలం 6.7% వడ్డీ రేటుతో లెక్కించిన అంచనా మాత్రమే. వడ్డీ రేటులో మార్పులు ఉంటే, తుది రాబడిలో స్వల్ప తేడాలు ఉండవచ్చు. ఈ పథకంలో తెరవబడిన అకౌంట్ ఐదు సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. అయితే, ఇక్కడే ఈ పథకం మరో ముఖ్యమైన ప్రయోజనం ఉంది. మెచ్యూరిటీ తర్వాత మీరు కావాలనుకుంటే, మీ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అంటే, మొత్తం పది సంవత్సరాల పాటు మీరు మీ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అలా చేస్తే మీకు వచ్చే ఆదాయం రూ.34లక్షల పైనే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories