Honda: కారు కొనాలనుకుంటున్నారా.. హోండా కార్లపై భారీ తగ్గింపు..!

Honda Offering Huge Discounts on all Cars in March 2022
x

Honda: కారు కొనాలనుకుంటున్నారా.. హోండా కార్లపై భారీ తగ్గింపు..!

Highlights

Honda: హోండా కార్స్ ఇండియా మార్చి 2022లో తన కార్లపై సూపర్‌ ఆఫర్లను ప్రకటించింది.

Honda: హోండా కార్స్ ఇండియా మార్చి 2022లో తన కార్లపై సూపర్‌ ఆఫర్లను ప్రకటించింది. ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ అన్ని కార్లపై ఈ ఆఫర్‌లను అందించింది. ఇవి మార్చి 31 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపులన్నీ హోండా అమేజ్, హోండా సిటీ నాలుగు, ఐదో జనరేషన్, హోండా WRV (WR-V), హోండా జాజ్‌లపై ప్రకటించారు. హోండా కార్స్ ఇండియా మోడల్, వేరియంట్ ఆధారంగా ఈ అన్ని కార్లపై రూ. 35,596 వరకు ఆఫర్లని అందిస్తుంది.

హోండా సిటీ 5వ జనరేషన్

ఈ సెడాన్‌పై కంపెనీ గరిష్టంగా రూ.35,596 తగ్గింపును ఇచ్చింది. వీటిలో రూ.10,000 వరకు నగదు తగ్గింపు, కార్ల మార్పిడిపై రూ. 5,000 ప్రయోజనాలు, పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 7,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 8,000 వరకు కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి.

హోండా సిటీ 4వ జనరేషన్

నాలుగో తరం హోండా సిటీపై రూ.20,000 వరకు ఆఫర్‌లు అందించారు. కంపెనీ పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 7,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈ కారుపై రూ. 8,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇచ్చింది.

హోండా జాజ్

హోండా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై వినియోగదారులకు రూ. 33,158 వరకు ప్రయోజనాన్ని అందించింది. ఇందులో రూ.10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,158 వరకు FOC యాక్సెసరీలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కోసం రూ. 5,000, పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 7,000, రూ. 4,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఇచ్చింది.

హోండా WR-V

కంపెనీ తన సబ్ కాంపాక్ట్ SUV హోండా WR-Vపై మొత్తం 26,000 ఆఫర్లని అందించింది. ఇది అన్ని పెట్రోల్ వేరియంట్‌లపై ఇస్తుంది. వీటిలో కార్ల మార్పిడిపై రూ.10,000 వరకు బోనస్, పాత కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, హోండా కార్లను మార్చుకుంటే రూ. 7,000 వరకు ప్రయోజనాలు, రూ. 4,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

హోండా అమేజ్

చివరగా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ వంతు వచ్చింది. దీనిపై కంపెనీ అన్ని వేరియంట్‌లపై మొత్తం రూ.15,000 వరకు తగ్గింపును ఇచ్చింది. ఇందులో హోండా పాత కస్టమర్‌లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 6,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 వరకు కార్పొరేట్ తగ్గింపు 31 మార్చి 2022 వరకు అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories