తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త షో ప్రారంభించనున్న హెచ్ఎం టీవి

HMTV News Channel will Launch the Latest Show in the History of Telugu Television
x

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త షో ప్రారంభించనున్న హెచ్ఎం టీవి

Highlights

* అక్టోబర్‌లో ప్రారంభం కానున్న హెచ్ఎంటీవీ స్టార్టప్ హౌస్ ఫండింగ్ షో * గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన ఆడిషన్స్

HMTV: తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త షోను ప్రారంభించనుంది హెచ్ఎం టీవీ. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న hmtv స్టార్టప్ హౌస్ ఫండింగ్ షో ఆడిషన్స్ గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు వినూత్న ఆలోచనలతో రూపొందించిన బిజినెస్ కాన్సెప్ట్‌లను షోలో ప్రదర్శించారు. నెలకు 4 షోలుగా సంవత్సరం పొడవునా ఈ కార్యక్రమం జరగనుంది.

ఇక ప్రతి వారం ఈ షోలో నలుగురు కంటెస్టెంట్ లకు అవకాశం ఇవ్వనున్నారు. నిపుణులైన న్యాయ నిర్ణేతలు వారిని ఎంపిక చేసి వారి కాన్సెప్టులకు తగ్గట్టుగా కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి ప్రోత్సాహకం అందిస్తారు. ఈ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామని స్టార్టప్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO వినోద్ కుమార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories