Petrol, diesel prices: వాహనదారులకు శుభవార్త...! పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

Petrol, diesel prices: పెట్రో ధ‌ర‌ల‌పై రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుడ్ న్యూస్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Sept 2024 4:20 PM IST
Headroom To Cut Petrol And diesel Prices By RS 2-3 Per Litre says ICRA
X

Petrol, diesel prices: వాహనదారులకు శుభవార్త...! పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

Petrol, diesel prices: పెట్రో భారాల నుంచి సామాన్యుడికి కొంత ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌నుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ముడి చ‌మురు ధ‌ర‌ల్లో త‌గ్గుదల నిల‌క‌డ‌గా కొన‌సాగ‌డంతో పెట్రోల్ రిటైల్ ధ‌ర‌లు దిగిరానున్నాయ‌ని అంచ‌నా వేసింది.

ముడిచ‌మురు ధ‌ర‌ల త‌గ్గుద‌ల‌తో చ‌మురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు మెరుగుప‌డ‌టంతో పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్తించేందుకు మొగ్గుచూపుతాయ‌ని పేర్కొంది. దీంతో పెట్రోల్ ధ‌ర‌లు లీట‌ర్‌కు రెండు నుంచి మూడు రూపాయ‌ల వ‌ర‌కూ దిగిరావ‌చ్చ‌ని తెలిపింది.

అంత‌ర్జాతీయ ఆర్ధిక మంద‌గ‌మనం, అమెరికాలో అధిక చమురు ఉత్ప‌త్తితో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ఇదే స్ధాయిలో కొన‌సాగితే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల నుంచి కొంత రిలీఫ్ క‌లగ‌నుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story