HDFC Bank: వడ్డీరేట్లు పెంచిన HDFC బ్యాంక్ .. ఇప్పుడు ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే..?
HDFC Bank: HDFC బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
HDFC Bank: వడ్డీరేట్లు పెంచిన HDFC బ్యాంక్ .. ఇప్పుడు ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే..?
HDFC Bank: HDFC బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) 5 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రుణ వడ్డీ రేట్లు మార్చి 7, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెరుగుదల తర్వాత HDFC బ్యాంక్ హోమ్ లోన్ EMI పెరుగుతుంది. అయితే హెచ్‌డిఎఫ్‌సి ఎమ్‌సిఎల్‌ఆర్ రేట్లను ఎంత పెంచిందో వివరాలు తెలుసుకుందాం.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఓవర్ నైట్ MCLR ఇప్పుడు 8.65 శాతంగా ఉంది. ఒక నెల MCLR 8.65 శాతం, మూడు నెలల MCLR 8.70 శాతం, ఆరు నెలల MCLR 8.80 శాతంగా ఉంటుంది. ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 8.95 శాతం, రెండు సంవత్సరాల MCLR 9.05 శాతం మూడు సంవత్సరాల MCLR 9.15 శాతంగా నిర్ణయించారు.
వినియోగదారులకి నిజమైన వడ్డీ రేటు కాకుండా బ్యాంక్ మార్జిన్‌ను కూడా వర్తింపజేస్తుందని గమనించండి. MCLR పెరుగుదలతో మీ లోన్ EMI కూడా పెరుగుతుంది. బ్యాంక్ ఛార్జ్ చేసే మార్జిన్ CIBIL స్కోర్, ఉపాధి రకం మొదలైన వాటితో సహా అనేక వేరియబుల్స్‌పై ఆధారపడి ఉంటుంది. మీ నిజమైన EMI పెరుగుదల బ్యాంక్ మార్జిన్ ఛార్జీలు, MCLR ద్వారా నిర్ణయిస్తారని గుర్తుంచుకోండి.




