HDFC Bank: వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఇప్పుడు రుణభారం మరింత ఎక్కువ..!

HDFC Bank: మీరు ఇప్పుడు HDFC బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే పెరిగిన రేట్ల ప్రకారం EMI చెల్లించాలి.

Arun Chilukuri
Published on: 9 Jan 2023 2:35 PM IST
HDFC Bank has Hiked Lending Rates by up to 25 bps the Increased Interest Rates will be Effective From January 7
X

HDFC Bank: వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఇప్పుడు రుణభారం మరింత ఎక్కువ..!

HDFC Bank: మీరు ఇప్పుడు HDFC బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే పెరిగిన రేట్ల ప్రకారం EMI చెల్లించాలి. ఎందుకంటే HDFC రుణ రేట్లను 25 bps వరకు పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 7, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. మూడు నెలల, ఆరు నెలలకు MCLR రేటు 8.35 శాతం నుంచి 8.60, 8.45 శాతం నుంచి 8.70 శాతం ఉంటుందని తెలిపింది. ఒక-సంవత్సరపు MCLR ఇప్పుడు 8.60% నుంచి 8.85%కి, రెండేళ్ల MCLR 8.70% నుంచి 8.95%కి, మూడు సంవత్సరాల MCLR 8.80% నుంచి 9.05%కి పెరిగింది.

EMI పెరుగుతుంది

HDFC బ్యాంక్ తన MCLRని రుణ కాల వ్యవధిలో (bps) 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని కారణంగా ఇప్పుడు ఇల్లు, ఆటో, వ్యక్తిగత, ఇతర రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి. బ్యాంక్ కస్టమర్లు వివిధ రకాల రుణాల కోసం ప్రతి నెలా చెల్లించే EMIలో పెరుగుదలను చూస్తారు. ఇతర బ్యాంకులు ఇప్పటికే రెపో రేటు లింక్డ్ హోమ్ లోన్‌లను పెంచడం ప్రారంభించాయి. మీరు 20 సంవత్సరాల పాటు రూ.30 లక్షల రుణం తీసుకుంటే మీరు 8.86 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.26703 EMI చెల్లించాలి. ఇప్పుడు 8.6 శాతం చొప్పున ప్రతి నెలా రూ.26,225 EMI చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు రూ. 30 లక్షల రుణంపై మీ EMI రూ. 478 పెరుగుతుంది. మీరు 20 సంవత్సరాల పాటు రూ. 50 లక్షల రుణం తీసుకుంటే మీరు 8.86 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 43708 EMI చెల్లించాలి. అలాగే రూ.50 లక్షల రుణంపై మీ EMI రూ.797 పెరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిఎన్‌బి, కెనరా బ్యాంక్‌లతో సహా చాలా బ్యాంకులు డిసెంబర్‌లోనే తమ రుణ రేట్లను పెంచాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story