EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్‌ ఖాతాలున్నాయా.. అన్నిటిని విలీనం చేస్తే పెద్ద లాభం..!

Have More Than one PF Accounts Know the Easy way to Merge Them All
x

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్‌ ఖాతాలున్నాయా.. అన్నిటిని విలీనం చేస్తే పెద్ద లాభం..!

Highlights

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్‌ ఖాతాలని కలిగి ఉంటే వాటన్నిటిని విలీనం చేయడం అవసరం.

EPFO: ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్‌ ఖాతాలని కలిగి ఉంటే వాటన్నిటిని విలీనం చేయడం అవసరం. ఈపీఎఫ్ ఖాతాల విలీనం ప్రక్రియ చాలా సులభం. ఆన్‌లైన్‌లో సింపుల్‌గా చేయవచ్చు. అన్ని పీఎఫ్‌ ఖాతాలని విలీనం చేయడం వల్ల వాటిపై వడ్డీ మొత్తం పెరుగుతుంది. ఇలా అన్నిటిని ఒకే దగ్గరికి చేర్చడం వల్ల తరచుగా ఖాతా అప్‌డేట్‌ చేయనవసరం ఉండదు.

అంతేకాదు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. పెన్షన్, జీతం చెల్లింపులను ఒకే ఖాతాలోకి ఏకీకృతం చేయవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదనంగా ఖర్చులు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను ట్రాక్ చేయడాన్ని సులభతరం చేయవచ్చు. ఖాతాలను విలీనం చేయడం వల్ల మీ మొత్తం డేటాను ఒకే చోట ఏకీకృతం చేయవచ్చు. దీనివల్ల మీ సంస్థ ఆర్థిక పారదర్శకత మెరుగుపడుతుంది.

మీరు వేరే కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించి మీ పాత UAN నంబర్‌ను ఇస్తే పాత ఖాతాను కొత్త ఖాతాతో విలీనం చేయడం సాధ్యం కాదు. ఫలితంగా మునుపటి ఖాతాలో జమ చేసిన మొత్తం కొత్త ఖాతాకు బదిలీ అవదు. ఈ పరిస్థితిలో కొత్త ఖాతాలకు పాత నిధులను జమ చేయడానికి పీఎఫ్‌ ఖాతాలను విలీనం చేయడం అవసరం.

ఎలా విలీనం చేయాలి?

1. సభ్యుల సేవా పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.inకి వెళ్లండి.

2. 'ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్ కింద 'ఒక సభ్యుడు - ఒక EPF ఖాతా ఎంచుకోండి.

3. స్క్రీన్‌పై మీ వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇది మీ ప్రస్తుత యజమానితో నిర్వహించబడుతున్న ఈపీఎఫ్‌ ఖాతా వివరాలను కూడా చూపుతుంది.

4. పాత/మునుపటి ఖాతాను బదిలీ చేయడానికి మునుపటి యజమాని లేదా మీ ప్రస్తుత యజమాని ద్వారా ధృవీకరించాలి. బదిలీ అభ్యర్థనను వేగంగా ప్రాసెస్ చేయడం కోసం ఉద్యోగి ప్రస్తుత యజమాని ద్వారా ధృవీకరణను ఎంచుకోవచ్చు.

5. పాత మెంబర్ IDని ఎంటర్‌ చేయండి అంటే మునుపటి PF ఖాతా నంబర్ లేదా మునుపటి UAN అని అర్థం. 'గెట్ డిటైల్స్'పై క్లిక్ చేయండి. స్క్రీన్ మీ మునుపటి EPF ఖాతాలకు సంబంధించిన వివరాలను కనిపిస్తాయి.

6. 'గెట్ OTP'పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. OTPని ఎంటర్‌ చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయండి.

7. తర్వాత EPF ఖాతా విలీనం కోసం మీ అభ్యర్థన విజయవంత మవుతుంది. అయితే దీనిని మీ ప్రస్తుత యజమాని ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత, EPFO అధికారులు మీ మునుపటి EPF ఖాతాలను ప్రాసెస్ చేసి విలీనం చేస్తారు.

8. విలీనం స్థితి గురించి తెలుసుకోవడానికి పోర్టల్‌లో తిరిగి తనిఖీ చేస్తే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories