GST 2.0 Rate List: జీఎస్టీ తగ్గింపుతో భారీగా తగ్గిన వస్తువుల ధరలు.. 375 వస్తువులపై ధరల తగ్గింపు.. ఫుల్ లిస్ట్ ఇదే

GST 2.0 Rate List: జీఎస్టీ తగ్గింపుతో భారీగా తగ్గిన వస్తువుల ధరలు.. 375 వస్తువులపై ధరల తగ్గింపు.. ఫుల్ లిస్ట్ ఇదే
x
Highlights

GST 2.0 Rate List: వంటగది సరకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాళ్టి నుంచి తగ్గాయి.

GST 2.0 Rate List: వంటగది సరకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాళ్టి నుంచి తగ్గాయి. జీఎస్‌టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు నిన్న అర్థరాత్రి నుంచే తగ్గించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్‌లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్‌క్లబ్‌లు, సెలూన్లు, వ్యాయామ-యోగా కేంద్రాలపై, ఫేస్‌పౌడర్, షేవింగ్‌క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5 శాతానికి తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్‌టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషం.

ఇక ఔషధాల్లో భారీగా తగ్గింపు కనిపిస్తోంది. గతంలో 12 శాతంగా ఉన్న పన్నురేటు ఇప్పుడు 5 శాతానికి తగ్గింది. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను తొలగించారు. ఇక వాహనాలు ధరలు కూడా తగ్గాయి. ద్విచక్ర వాహనాల ధరలను రూ.18,800 వరకు, కార్ల ధరలను 4.48 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించిన ప్రకారం విలాసవంత కార్ల ధరలు అయితే 30.4 లక్షల వరకు దిగి వస్తున్నాయి.

మరోవైపు టీవీలపై వస్తు, సేవల పన్ను 28% నుంచి 18 శాతానికి తగ్గిన ఫలితంగా.. టీవీల ధరలు భారీగా తగ్గాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్‌ పరిమాణం ఉన్న టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది. తమ ఉత్పత్తుల ధరలను 2,500 నుంచి 85,000 మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే ప్రకటించాయి. దాని ప్రకారమే ధరలను తగ్గించారు. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇప్పుడు కంపెనీలు ధరలను తగ్గించడం కొనుగోళ్లకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడళ్ల ధరను 5 వేల నుంచి 71 వేల వరకు తగ్గించింది.

జీఎస్‌టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చినందున, రూ.7500 .. అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్‌ గదులపై రూ.525 వరకు ఆదా కానుంది. వీటిపై జీఎస్‌టీని 12% నుంచి 5 శాతానికి.. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ ట్యాక్స్‌ లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. ఫలితంగా హోటళ్ల ఆదాయాలు పెరిగేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు, అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.7500 వరకు హోటల్‌ గదులపై 12% జీఎస్‌టీ మరోవైపు పతంజలి ఫుడ్స్‌ అన్నీ ధరల తగ్గించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. నూనెలు, పప్పులు, మందులు అన్ని ధరలు తగ్గించినట్లు స్పష్టం చేసింది. అలాగే అనేక కంపెనీల నుంచి ధరలు తగ్గినట్లు ప్రకటనలు వచ్చాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories