డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?
x
Highlights

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2019లో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా మందగించాయి. అయితే, వరుసగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మళ్ళీ జీఎస్టీ వసూళ్లు...

డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2019లో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా మందగించాయి. అయితే, వరుసగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మళ్ళీ జీఎస్టీ వసూళ్లు పుంజుకున్నాయి. డిసెంబర్ 2019లో 1 లక్ష కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు వచ్చాయి. నవంబర్, డిసెంబర్ వరుసగా రెండో నెల కూడా లక్ష కోట్లు కలెక్షన్లు దాటాయి. డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,03,184 కోట్లుగా ఉన్నాయి. నవంబర్ నెల కంటే ఈ మొత్తం తక్కువైనప్పటికీ, 2018 డిసెంబర్ ప|పోల్చుకుంటే, ఈ వసూళ్లు ఎక్కువే. గత కొద్ది నెలలుగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. అయితే,. ఇప్పుడు కేంద్రం చర్యలతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. దీంతో వినియోగం పుంజుకుంటోందని భావించేందుకు అవకాశం ఏర్పడింది. అందుకే జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ కలెక్షన్లు పెరగడానికి వివిధ కారణాలున్నాయి.

జీఎస్టీ వసూళ్లు పెరుగుదల భారత ఆర్ధిక రంగానికి శుభసూచకంగా భావించవచ్చు. పన్ను లక్ష్యాలను చేరుకోవడానికి ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్ను వసూళ్లను పెంచాలని గత నెలలో సంబంధిత శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సూచించారు. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన జీఎస్టీ రెవెన్యూ ఇప్పుడు పెరగడం శుభసూచకమని డెలాయిట్ డైరెక్టర్ మణి అన్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు నియంత్రణలో ఉంటుందన్నారు. వచ్చే నెలల్లో ఈ-ఇన్వాయిస్, కొత్త రిటర్న్స్ అమలులోకి రానుండటంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

జీఎస్టీ వసూళ్లు వరుసగా 2 నెలలు పెరగడంతో వినియోగ డిమాండ్ గాడిన పడుతోందని భావిస్తున్నారు. పెట్టుబడులు, వినిమయ డిమాండ్ తగ్గడంతో గత రెండు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి 5 శాతానికి, 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినిమయం పెరుగుతుందనే అంశం ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. ప్రతి నెల రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లను ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రానున్న రోజుల్లోను నెలసరి జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు సులభంగా దాటే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

కాగా, జీఎస్టీ వసూళ్లు అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు రెట్లు, నాగాలండ్‌లో 88 శాతం, మణిపూర్‌లో 64 శాతం, మిజోరాంలో 60 శాతం చొప్పున పెరిగాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోను జీఎస్టీ కలెక్షన్లు పెరుగుదల నమోదు చేశాయి. గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పదకొండు శాతం, తెలంగాణలో పదమూడు శాతం పెరిగాయి. ఏపీలో రూ.2,265 కోట్లు, తెలంగాణలో రూ.3,420 కోట్లు జీఎస్టి తో సమకూరాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories