గ్రామీణ ప్రజలకి బంపర్ ఆఫర్.. రెట్టింపు డబ్బు సంపాదించే పోస్టాఫీసు స్కీం..!

Gram Sumangal Rural Postal Life Insurance Check for all Details
x

గ్రామీణ ప్రజలకి బంపర్ ఆఫర్.. రెట్టింపు డబ్బు సంపాదించే పోస్టాఫీసు స్కీం..!

Highlights

Gram Sumangal: పోస్టాఫీసులో పెట్టుబడి మీ భవితకి పెద్ద రాబడి అని చెప్పవచ్చు.

Gram Sumangal: పోస్టాఫీసులో పెట్టుబడి మీ భవితకి పెద్ద రాబడి అని చెప్పవచ్చు. పోస్టాఫీసు స్కీంలు చిన్న, మధ్య తరగతి ప్రజలకి అనువుగా ఉంటాయి. గ్రామీణ ప్రజలకి పోస్టాఫీసు పథకం లాభదాయకమైన పెట్టుబడి. రోజుకి రూ.170 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో రూ.19 లక్షలు సంపాదించే ఒక పోస్టాఫీసు పథకం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పోస్టాఫీసు పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

దీని పేరు 'గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్'. ఈ పథకంలో మీరు రోజుకు రూ.170 ఆదా చేస్తే రూ.19 లక్షల వరకు పొందవచ్చు. పాలసీ హోల్డర్ మనుగడపై మనీ బ్యాక్ ప్రయోజనం అందుబాటులో ఉంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా వాపసు వస్తుంది. గ్రామ సుమంగల్ యోజనలో పాలసీదారు మెచ్యూరిటీపై బోనస్ పొందుతారు. ఈ పథకాన్ని 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.

గ్రామ సుమంగల్ పథకాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీకు 25 ఏళ్లు అనుకుందాం. 10 లక్షల హామీ మొత్తాన్ని కొనుగోలు చేస్తారు. పాలసీ వ్యవధిని 15 సంవత్సరాల పాటు ఉంచినట్లయితే నికర నెలవారీ ప్రీమియం రూ.6793 అవుతుంది. పాలసీ వ్యవధిని 20 సంవత్సరాలు ఉంచినట్లయితే నెలవారీ ప్రీమియం రూ.5121 అంటే రోజుకు రూ.170 అవుతుంది. 20 ఏళ్ల పాలసీ తీసుకున్న వారికి 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్ల వ్యవధిలో 20-20% చొప్పున డబ్బు తిరిగి వస్తుంది. మిగిలిన 40 శాతం డబ్బు బోనస్‌తో పాటు మెచ్యూరిటీపై వస్తుంది. పాలసీదారు మరణించినప్పుడు నామినీకి బోనస్ మొత్తంతో పాటు హామీ మొత్తం చెల్లిస్తారు.

19 లక్షలు

15 సంవత్సరాల ప్రీమియం కాలానికి బోనస్ మొత్తం రూ.15X4500X10 = 6.75 లక్షలు. ప్రీమియం టర్మ్ 20 సంవత్సరాలు అయితే బోనస్ మొత్తం 20X4500X10 = రూ.9 లక్షలు. హామీ మొత్తం రూ.10 లక్షలు కాబట్టి 15 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రయోజనం రూ.16.75 లక్షలు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.19 లక్షలు అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories