Post Office: పోస్టాఫీసులోని పొదుపు పథకంలో పెట్టుబడి మీ భవితకు రాబడి..

Good Returns if Invested in Post Office Savings‌ Scheme
x

Post Office: పోస్టాఫీసులోని పొదుపు పథకంలో పెట్టుబడి మీ భవితకు రాబడి.. 

Highlights

Post Office: మీరు కష్టపడిన సొమ్ము ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అలాంటి వారికి పోస్టాఫీసు మంచి ఎంపిక అని చెప్పవచ్చే.

Post Office: మీరు కష్టపడిన సొమ్ము ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా.. అలాంటి వారికి పోస్టాఫీసు మంచి ఎంపిక అని చెప్పవచ్చే. ఎందుకంటే ఇందులో అనేక రకాల స్కీమ్స్‌ ఉంటాయి. అంతేకాదు మీ డబ్బుకు రక్షణ ఉంటుంది. మంచి రాబడి వస్తుంది. కొన్ని స్కీమ్‌లపై పన్ను మినహాయింపు కూడా దొరుకుతుంది. అన్నింటికి మించి ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు స్కీమ్‌లలో పొదుపు ఖాతా కూడా ఒకటి. దీని గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఒక వ్యక్తి లేదా భార్యా భర్తలు, లేదా ఇద్దరు కలిసి ఓపెన్ చేయవచ్చు. ఇది కాకుండా మైనర్ తరపున ఎవరైనా పెద్దవారు కూడా ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీసు పథకంలో ఖాతా తెరవాలంటే కనీసం రూ.500 ఉంటే చాలు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాపై 4.0 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటు వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలకు కూడా వర్తిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకంలో ఒక వ్యక్తి ఒకే ఖాతాను మాత్రమే ఓపెన్ చేయగలడు. మైనర్ లేదా 10 ఏళ్లు పైబడిన వ్యక్తులు వారి పేరిట ఒక ఖాతాకి అనుమతి ఉంటుంది.

జాయింట్ హోల్డర్ మరణించిన సందర్భంలో జీవించి ఉన్న హోల్డర్ ఏకైక హోల్డర్. ఒకవేళ జీవించి ఉన్న వ్యక్తిపై ఇప్పటికే ఖాతా ఉంటే అప్పుడు జాయింట్ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో సింగిల్‌ జాయింట్ అకౌంట్‌గా లేదా జాయింట్‌ అకౌంట్‌ సింగిల్‌ అకౌంట్‌గా మార్చడం సాధ్యం కాదు. ఈ పథకంలో ఖాతా తెరిచే సమయంలో నామినీ పేరును రాయడం తప్పనిసరిగా జరగాలి. మైనర్ మేజర్ అయిన తర్వాత ఖాతా తన పేరుపై మార్చుకోవడానికి సంబంధిత పోస్టాఫీసులో కొత్త ఖాతా ప్రారంభ ఫారమ్‌ నింపాల్సి ఉంటుంది. అంతేకాదు KYC పత్రాలను సమర్పించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories