పీఎన్‌బీ కస్టమర్లకి శుభవార్త.. ఇప్పుడు సులువుగా లోన్‌ సౌకర్యం..!

PNB Customers: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌.

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 9:30 PM IST
Good News for PNB Customers If you Have a Salary Account you will get this Benefit
X

పీఎన్‌బీ కస్టమర్లకి శుభవార్త.. ఇప్పుడు సులువుగా లోన్‌ సౌకర్యం..!

PNB Customers: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌. ఇందులో సాలరీ అకౌంట్ ఉంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. బ్యాంకు ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. సాలరీ ఖాతా ఉన్న వినియోగదారులకు ఈ ప్రత్యేక క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు మరో ప్రత్యేక సౌకర్యాన్ని బ్యాంకు ప్రారంభించింది. ఈ సదుపాయం పీఎన్‌బీ ఎఫ్డీ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం. విశేషమేమిటంటే ఈ ఓవర్‌డ్రాఫ్ట్ పొందడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పీఎన్‌బీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ PNB One నుంచి సౌకర్యవంతంగా పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పీఎన్‌బీ బ్యాంకు ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డుని ప్రారంభించింది. దీని కోసం సాలరీ ఖాతా ఉన్న కస్టమర్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డ్‌లో రెండు చెల్లింపు ఎంపికలు ఉంటాయి. ఈ గేట్‌వే రూపే, వీసా. ఈ కార్డు పొందడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ PNB One ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం కోసం ఆన్‌లైన్ దరఖాస్తుపై కస్టమర్‌లు 0.25% తగ్గింపును కూడా అందిస్తోంది.

మీరు ప్రీ క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్‌ని పొందాలనుకుంటే PNB One లేదా వెబ్‌సైట్‌ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. పాన్ నంబర్, ఖాతా వివరాలను నమోదు చేయాలి. మీ వివరాలను క్రాస్ వెరిఫై చేసిన తర్వాత బ్యాంక్ కార్డ్‌ని జారీ చేస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఒక రకమైన రుణమే. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం ఆన్‌లైన్ దరఖాస్తుపై కస్టమర్‌లు 0.25% తగ్గింపును పొందుతారు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న కస్టమర్లు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని సులభంగా పొందవచ్చు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story