ఈ బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. పాతకార్లు కొనడానికి రుణం మంజూరు..!

Indusind Customers: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.

Arun Chilukuri
Updated on: 3 Aug 2022 5:30 PM IST
Good News for Indusind Customers Loan Sanctioned for Buying Used Cars
X

ఈ బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. పాతకార్లు కొనడానికి రుణం మంజూరు..!

Indusind Customers: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు ఇండస్‌ఇండ్ బ్యాంక్.. రూపీతో (Rupyy)ఒక ఒప్పందం కుదుర్చుకుంది. Rupyy తన కస్టమర్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేపర్‌లెస్ లోన్‌లను అందించే ఒక సంస్ధ. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు Rupyy ద్వారా పాత కార్లను కొనుగోలు చేయడానికి సులువుగా రుణాలు పొందుతారు.

కస్టమర్లు పేపర్‌ లెస్‌ మార్గంలో రుణాలు పొందుతారు. అంతేకాదు ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది. దీంతో పాటు కస్టమర్లు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఎంపికను కూడా పొందుతారు. దీనిపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ TS రాంగోపాలన్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం తర్వాత బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ సేవలు పెరుగుతాయని అన్నారు.

ఇప్పుడు రూపే వల్ల కారు లేదా ఆటో రుణాన్ని తీసుకోవడం చాలా సులభం. దీంతో ఖాతాదారులకి బ్యాంకుపై మరింత నమ్మకం పెరుగుతుంది. ఈ భాగస్వామ్యం నుంచి ప్రజలు కొత్త డిజిటల్ అనుభవం ప్రయోజనాన్ని పొందుతారు. చాలామంది సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై రుణాల కోసం వేచి చూస్తారు. అలాంటి వారికి ఇది చాలా బెస్ట్‌ అని చెప్పవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story