Airtel:ఎయిర్‌టెల్ యూజర్లకి శుభవార్త.. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం..!

Good News For Airtel Postpaid Users Netflix Amazon Prime Disney+ Hotstar Free
x

Airtel:ఎయిర్‌టెల్ యూజర్లకి శుభవార్త.. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం..!

Highlights

Airtel:ఎయిర్‌టెల్ యూజర్లకి శుభవార్త.. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం..!

Airtel: ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇది వింటే ముఖంలో చిరునవ్వు వస్తుంది. నెలకు రూ.649 నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్‌ను కేవలం రూ.150కే పొందవచ్చు. అంటే రూ.500 తగ్గింపు లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా అందిస్తుంది. దీని కోసం రెండు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటితో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందడానికి మీరు కేవలం రూ. 150 మాత్రమే ఖర్చు చేయాలి. నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్‌ 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ అత్యంత ఖరీదైన ప్లాన్. ఈ ప్లాన్‌లో నెలవారీ 200GB డేటా అందుబాటులో ఉంటుంది. అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ప్లాన్ నలుగురు కుటుంబ సభ్యులకు Uri యాడ్ ఆన్ వాయిస్ కనెక్షన్‌లను అందిస్తుంది. ప్రతి యాడ్ ఆన్ కనెక్షన్ 200GB వరకు రోల్‌ఓవర్‌తో 30GB డేటాను పొందుతుంది. ఇది కాకుండా ప్రతిరోజూ 100SMS అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రయోజనాల గురించి చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ ప్లాన్, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్‌, ఒక సంవత్సరం పాటు డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం పొందడానికి కస్టమర్ ఈ ప్లాన్‌పై అదనంగా రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.

ఎయిర్‌టెల్‌ 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా చాలా బాగుంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా 150GB నెలవారీ డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు 3 ఉచిత యాడ్ ఆన్ వాయిస్ కనెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి కనెక్షన్ 200GB వరకు రోల్‌ఓవర్‌తో 30GB డేటాను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఒక నెల, అమెజాన్ ప్రైమ్ 6 నెలలు, డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం పాటు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్‌ను పొందడానికి నెలకు రూ. 450 చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories