బంగారం, వెండి ధరలపై ఉక్రెయిన్ ఎఫెక్ట్

Gold, Silver Rates Surge As Ukraine Crisis
x

బంగారం, వెండి ధరలపై ఉక్రెయిన్ ఎఫెక్ట్

Highlights

Gold Prices Today: ఉక్రెయిన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.

Gold Prices Today: ఉక్రెయిన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 652 మేర పెరిగింది. నిన్న మంగళవారం 50, 518 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ఏకంగా 652 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం తులం బంగారం ధర 51, 170 రూపాయలు పలుకుతోంది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర 1,715 పెరిగి ప్రస్తుతం 66,130 దగ్గర ట్రేడవుతోంది.

అటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఫ్లాట్‌గా ఉంది. ప్రస్తుతం ఔన్సుకు 1899 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే 52వేల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories