Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ వుండగా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 2 May 2021 6:47 AM IST
Gold Silver price today on May 2nd, 2021 at Hyderabad, Delhi, Vijayawada, Mumbai, Chennai
X

Gold, Silver Price Today:(File Image)

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న(శనివారం) మాత్రం కాస్త పెరిగింది. ఈ రోజు అదే ధరలు కొనసాగుతునానయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,370గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,570కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,110గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,800గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,800గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది.

వెండి ధరలు...

బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న వెండి ధరలు నిన్న(శనివారం) మాత్రం కొద్దిగా పెరిగింది. కానీ ఈ రోజు ఆదివారం ఉదయం వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కిలో వెండి ధర రూ.67,500గా ఉంది.

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కేజీ సిల్వర్ రూ.67,500గా ఉంది. ఇకపోతే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి ధర రూ.72,800గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.675గా ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.67,500గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి రూ. 72,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.728గా ఉండగా.. కిలో వెండి రూ. 72,800గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story