Gold Silver Price Crash: బులియన్ మార్కెట్‌లో భూకంపం: ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మళ్ళీ 1980 నాటి సీన్ రిపీట్ అవుతుందా?

Gold Silver Price Crash Today: గత వారం రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి.

Arun Chilukuri
Published on: 3 Feb 2026 11:36 AM IST
Gold Silver Price Crash: బులియన్ మార్కెట్‌లో భూకంపం: ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మళ్ళీ 1980 నాటి సీన్ రిపీట్ అవుతుందా?
X

Gold Silver Price Crash Today: గత వారం రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తూ, కొనుగోలుదారులకు ఊరటనిస్తూ ధరలు భారీగా దిగివచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే బంగారం సుమారు 40 వేల రూపాయలు, వెండి ఏకంగా సగానికి సగం పడిపోవడం బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రికార్డుల నుంచి పాతాళానికి..

గత గురువారం తులానికి ₹1,90,000 పలికిన బంగారం ధర, ప్రస్తుతం ₹1,50,000 వద్దకు చేరుకుంది. అంటే కేవలం కొద్దిరోజుల్లోనే రూ. 40,000 కరెక్షన్ తీసుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే వారం రోజుల్లో బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు వెండి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలో వెండి ₹4,20,000 రికార్డు స్థాయిని తాకి, ప్రస్తుతం MCX మార్కెట్‌లో ₹2,27,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు 50 శాతం పతనం కావడంతో సిల్వర్ ETF ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు.

ఎందుకీ భారీ పతనం?

బడ్జెట్ ప్రభావం: పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారంపై సెంటిమెంట్ మారడం.

డాలర్ బలం: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాల వైపు మళ్లారు.

అమెరికా రాజకీయాలు: ఇరాన్‌తో డీల్ కుదిరే అవకాశం ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ మార్పు వార్తలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

లాభాల స్వీకరణ: భారీ ధరల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను వెనక్కి తీసుకోవడం (Profit Booking) ధరల తగ్గుదలకు ప్రధాన కారణం.

1980 నాటి సీన్ రిపీట్ అవుతుందా?

1980వ దశకంలో బంగారం ధరలు ఇలాగే అనూహ్యంగా పెరిగి, మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి దాదాపు 26 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కొన్ని నెలల వ్యవధిలోనే రెట్టింపు అయిన ధరలు, మళ్లీ పాత ధరల వద్ద ఎప్పుడు స్థిరపడతాయోనన్న ఆందోళన ట్రేడర్లలో కనిపిస్తోంది. ఒకవేళ భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సక్సెస్ అయితే, పసిడి ధరలు మరింత దిగజారే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story