Gold Rates: నిలకడగా బంగారం ధరలు.. స్థిరంగా నిలిచిన వెండి ధరలు!

Gold Rates: నిలకడగా బంగారం ధరలు.. స్థిరంగా నిలిచిన వెండి ధరలు!
x
Highlights

వారం రోజులుగా పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు కాస్త ఆగాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాటి ధర 40,690...

వారం రోజులుగా పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు కాస్త ఆగాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం నాటి ధర 40,690 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దీంతో 37,300 రూపాయల స్థిరంగా ఉన్నాయి. కాగా, వెండి ధర కూడా ఈరోజు నిలకడగా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,350 రూపాయల వద్ద ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,690 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,300 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,300 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 38,100 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 49,350 రూపాయల వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories