భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలూ ఆకాశంలో!

భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలూ ఆకాశంలో!
x
Highlights

బంగారం ధరలు పై పైకి కదులుతూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదే దారిలో భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24...

బంగారం ధరలు పై పైకి కదులుతూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదే దారిలో భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగింది. దీంతో 40,690 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 37,300 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా వరుసగా రెండో రోజూ భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,350 రూపాయల వద్దకు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,690 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,300 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పై పైకి కదిలాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 39,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 38,100 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 49,350 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories