బంగారం ధరలు పైపైకే.. భారీగా పెరిగిన వెండి ధరలు!

బంగారం ధరలు పైపైకే.. భారీగా పెరిగిన వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు పై పైకి కదులుతూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదే దారిలో భారీ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24...

బంగారం ధరలు పై పైకి కదులుతూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా అదే దారిలో భారీ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగింది. దీంతో 40,450 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 37,100 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 1300 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,100 రూపాయల వద్దకు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,450 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,100 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పై పైకి కదిలాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 39,100 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,900 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 1300 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 49,100 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories