షాకిచ్చిన బంగారం..భారీగా పెరిగిన వెండి!!

షాకిచ్చిన బంగారం..భారీగా పెరిగిన వెండి!!
x
Highlights

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత పైకి కదిలాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల...

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత పైకి కదిలాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు పెరిగింది. దీంతో 39,960 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,650 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 440 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,300 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,650 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 38,650 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,450 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 440 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 47,300 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
Next Story
More Stories