
నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24...
నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,580 రూపాయల వద్ద నిలింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,280రూపాయల వద్ద నిలకడగా ఉంది. కాగా, వెండి ధర కూడా మార్పులు లేకుండా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయల వద్ద నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,580 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,280 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 37,500 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire