మళ్లీ పెరుగుతున్న బంగారం.. వెండిదీ అదేదారి!

మళ్లీ పెరుగుతున్న బంగారం.. వెండిదీ అదేదారి!
x
Highlights

బంగారం ధరలు మళ్ళీ పైకి కదిలాయి. అదే దారిలో వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజూ అదే దారిలో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు పెరిగింది. దీంతో 39,620 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయల పెరుగుదలతో 36,320రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,620 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,320 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 పెరింది.దీంతో 38,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,100 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

Show Full Article
Print Article
Next Story
More Stories