స్వల్పంగా పెరిగిన బంగారం..అదే దారిలో వెండి ధరలు!

స్వల్పంగా పెరిగిన బంగారం..అదే దారిలో వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు ఈరోజు (18-12-2019) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కాగా, వెండి ధరలూ అదేబాటలో నడిచాయి.

నిన్న మిశ్రమంగా కదిలిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 39,600 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదలతో 36,250 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 110 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,800 రూపాయలకు చేరుకుంది.

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,600 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,250 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 పెరింది.దీంతో 38,200 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,000 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 110రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
Next Story
More Stories