నిలకడగా బంగారం! భారీగా పడిపోయిన వెండి ధరలు!!

నిలకడగా బంగారం! భారీగా పడిపోయిన వెండి ధరలు!!
x
Highlights

రెండురోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. కాగా, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,170 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 35,910 రూపాయల వద్ద ఉంది. అయితే, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీకి 750 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,650 వద్దకు చేరింది.

ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,170 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 35,910 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,700 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 750 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,650 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
Next Story
More Stories