స్థిరంగా బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి ధర!

స్థిరంగా బంగారం ధరలు..స్వల్పంగా తగ్గిన వెండి ధర!
x
Highlights

నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు (10-12-2019) నిలకడగా ఉన్నాయి. అయితే, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

రెండు రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండిధరలు స్వల్పంగా తగ్గాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 39,530 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధర 36,120 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అయితే, వెండి ధరలు ఈరోజు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,400 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,530 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,120 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,100 రూపాయల వద్దకు నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,900 రూపాయల వద్దఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి వంద రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతbుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories