నిలకడగా ఉన్న బంగారం ధరలు

నిలకడగా ఉన్న బంగారం ధరలు
x
Highlights

నిన్న కొద్దగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా వున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఇదేబాట పట్టాయి. 07.12.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం...

నిన్న కొద్దగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా వున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఇదేబాట పట్టాయి. 07.12.2019 శనివారం పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరలతో పోలిస్తే స్థిరంగా ఉంది. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,770 రూపాయల వద్ద ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 36,480 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,400 వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,770 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,480 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం నిలకడగా ఉంది. దీంతో 38,450 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 37,250 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర మార్పులు లేవు. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07.12.2019 శనివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి



Show Full Article
Print Article
More On
Next Story
More Stories