పరుగులు తీస్తున్న బంగారం.. అదే దారిలో వెండి!

పరుగులు తీస్తున్న బంగారం.. అదే దారిలో వెండి!
x
Highlights

బంగారం ధరలుపరుగులు పెడుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కసారిగా భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ఈరోజూ(05.01.2020) అదేదారిలో ఉంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు...

బంగారం ధరలుపరుగులు పెడుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కసారిగా భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ఈరోజూ(05.01.2020) అదేదారిలో ఉంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు పరుగులు పెట్టాయి.

హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు శనివారం ధరలతో పోలిస్తే మరింత పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 390 రూపాయలు పెరిగి మళ్లీ షాక్ ఇచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,770 రూపాయలకు ఎగబాకింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. ఏకంగా 390 రూపాయలు పెరగడంతో 38,320 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా కేజీ కి 200 రూపాయలు పెరిగాయి. దీంతో కేజీ వెండిధర 49,600 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,770 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,320 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలుమరింత పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా 400 రూపాయలు పైకి ఎగసింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,350 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,150 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 200 రూపాయలు పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,600 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
Next Story
More Stories