Gold Rate Today September 26 : నేడు బంగారం, వెండి ధరలు..80వేల మార్క్ దిశగా పసిడి ధర

Gold Rate Today September 26: దేశంలో బంగారం, వెండి ధరలు గురువారం కాస్త పెరిగాయి. వెండి ధర కాస్త తగ్గితే..బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2024 6:48 AM IST
Gold Rate Today September 26 -2024 gold and silver rates in Hyderabad
X

 Gold Rate Today September 26 : నేడు బంగారం, వెండి ధరలు..80వేల మార్క్ దిశగా పసిడి ధర

Gold Rate Today September 26: దేశంలో బంగారం ధరలు గురువారం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. రూ. 70, 610కి చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 70,600గా ఉంది. వంద గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. రూ. 7,06,100గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,061గా ఉంది.

మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగింది. రూ. 77,030వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ. 77,020గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7,70,300గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,703గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు గురువారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,760గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,180గా ఉంది. కోల్ కతా, పుణె, కేరళ, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,610గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధఱ రూ. 77,030గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశంలో వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9270గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. రూ. 92,700గా ఉంది. బుధవారం ఈ ధర రూ. 92,800గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 1,01,100 ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story