Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. రూ. 3 వేలు తగ్గిన బంగారం ధరలు..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు (నవంబర్ 14) బంగారం ధరలు మరోసారి తగ్గాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2024 6:56 AM IST
Gold Rate Today November 14 2024
X

Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. రూ. 3 వేలు తగ్గిన బంగారం ధరలు..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు (నవంబర్ 14) బంగారం ధరలు మరోసారి తగ్గాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమధ్యే ఇటీవల బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుతూ ఉండటం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమే. గత రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3000 తగ్గగా, వెండి ధర కిలోకు రూ. 5 వేలు తగ్గింది.

నేడు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 290 తగ్గి రూ.76,990కి చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.70,590కి చేరింది. మరోవైపు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,840కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,440కి చేరింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story