Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. దూసుకుపోయిన వెండి ధరలు

Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. దూసుకుపోయిన వెండి ధరలు
x
Highlights

Gold Rate: మూడురోజులు నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజూ కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (29.12.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు స్థిరంగా అటూ వచ్చిన వెండి ధరలు ఈరోజు షాకిచ్చాయి. ఒక్కసారిగా పైకి ఎగిశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (29.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలు పెరిగి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 330 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,280 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 1400 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 72వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర 72,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (29.12.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలు పెరిగి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 330 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,280 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా చూపులు చూశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయల పెరుగుదల కనబరిచింది. దాంతో 53,230 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 1300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర 68,900 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories