Gold Rate: కాస్త పెరిగిన బంగారం ధరలు.. మార్పులు లేకుండా నిలిచిన వెండి ధరలు!

Today gold rate in India
x
ఈరోజు బంగారం ధరలు 
Highlights

Gold Rate: ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (జనవరి 27) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మార్పులు లేకుండా నిలిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (27.01.2021) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 46,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,230 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల వద్దే ఉన్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎటువంటి మార్పులూ లేవు. దీంతో 71వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 71,300 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (27.01.2021) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 46,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,230 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 48,090 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 52,460 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే కాస్త తగ్గింది. ఈరోజు 200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 66,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories