Top
logo

Gold Rate: ఐదురోజుల తరువాత కాస్త పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు కూడా అదేదారిలో!

Gold Rate: ఐదురోజుల తరువాత కాస్త పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు కూడా అదేదారిలో!
X
Highlights

Gold Rate: బంగారం ధరలు ఐదురోజుల తగ్గుదల తరువాత ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదల కనబరిచాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

వరుసగా ఐదురోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పైకెగశాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (22.11.2020) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. ఇదిలా ఉంటె ఢిల్లీ లో మాత్రం బంగారం ధరలు తగ్గుదల కాంబరచగా..వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (22.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 300 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు కాస్త పైకెగశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఆదివారం (22.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 300 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కింది చూపులు చూశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధర కంటె 240 రూపాయల తగ్గుదల కనబరిచింది. దాంతో 53,610 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటె భారీగా పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర 67,300 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Web Titlegold-rate-today-22-11-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi
Next Story