Gold Rate: బంగారం ధరలు స్థిరంగా..మార్పులు లేకుండా వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు స్థిరంగా..మార్పులు లేకుండా వెండి ధరలు!
x
Highlights

Gold Rate: మూడు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిలకడగా నిలిచాయి. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నిలిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు శనివారం ఎటువంటి మార్పులకు లోనవలేదు. దీంతో సోమవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే మార్పులు లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (21.12.2020) స్థిరంగా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి.హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కదలిక లేకుండా ఉన్నాయి. సోమవారం (21.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలవద్దే నిలకడగా నిలిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 46,800 రూపాయలుగా కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ వద్ద స్థిరంగా ఉండి..51,050 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు నిలకడగా..

బంగారం ధరలు మార్పులు లేకుండా ఉంటె.. వెండి ధరలు కూడా ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర వద్ద స్థిరంగా నిలిచాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,500 రూపాయలవద్దే ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు కదలిక లేకుండా ఉన్నాయి. సోమవారం (21.12.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలవద్దే నిలకడగా నిలిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 46,800 రూపాయలుగా కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ వద్ద స్థిరంగా ఉండి..51,050 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర 48,950 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధర 53,440 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ మాత్రం వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 67 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,900 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories