Gold rate: పెరిగిన పసిడి ధరలు.. స్థిరంగా వెండి ధరలు

Gold rate Today Hyderabad Amaravathi
x

Gold Rate

Highlights

Gold rate: 18 రోజులుగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.

Gold rate: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. గత వారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) దేశీయంగాపైకి కదిలాయి. మరో వైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. 18 రోజుల్లో బంగారం ధర రూ.3330 పెరగగా... వెండి ధర రూ.6400 పెరిగింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. నిన్నటి ప్రారంభ ధరలతో పోలిస్తే సోమవారం పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,160 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,170 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు మార్పులు లేవు

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరలతో పోలిస్తే ఎలాంటి మార్పులు లేవు. ఈరోజు వెండి ధరల్లో పెద్దగా మార్పులూ లేవు. కేజీ వెండి 73వేల రూపాయల వద్ద ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 73,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఆదివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,160 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,170 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. ఢిల్లీలో 10గ్రాములు 22 క్యారెట్ల ధర 40,420 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధరల కంటే కాస్త పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 68,600 రూపాయల వద్ద నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర ఢిల్లీలో 5,100 రూపాయలు తగ్గువగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories